జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు భిన్నంగా పాలన: నాదెండ్ల

ABN , First Publish Date - 2022-02-14T17:16:10+05:30 IST

మత్స్యకారులకు భరోసా కోసం జనసేన అభ్యున్నతి యాత్ర చేస్తోందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు భిన్నంగా పాలన: నాదెండ్ల

తూర్పు గోదావరి జిల్లా: మత్స్యకారులకు భరోసా కోసం జనసేన అభ్యున్నతి యాత్ర చేస్తోందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలకు భిన్నంగా పాలన ఉందని విమర్శించారు. మత్స్యకార భరోసా కోసం రూ.10 వేలు ఇవ్వాల్సింది.. 2 లక్షల మందికిపైనే అయితే కేవలం లక్ష మందికి మాత్రమే లబ్ది చేకూరుతుందన్నారు. ప్రమాదంలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షల భీమా ఏమైందని ప్రశ్నించారు. డీజిల్‌పై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఎవరికి సరిపోతుందన్నారు. సీఎం జగన్ కూడా మత్స్యకార గ్రామాల్లో యాత్ర చేయాలన్నారు. జనసేన నాయకులపై, కార్యకర్తలపై కేసులు పెట్టి హింసిస్తున్నారని మండిపడ్డారు. జీవో 217పై ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలన్నారు. మత్స్యకారులు, వారి హక్కులకై పోరాటం చేస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-14T17:16:10+05:30 IST