భీమ్లానాయక్‌పై ప్రభుత్వ తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది: నాదెండ్ల మనోహార్

ABN , First Publish Date - 2022-02-26T21:07:23+05:30 IST

భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్బంగా ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ తీవ్రవిమర్శలు చేశారు.

భీమ్లానాయక్‌పై ప్రభుత్వ తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది: నాదెండ్ల మనోహార్

అమరావతి: భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్బంగా ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ తీవ్రవిమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వ తీరు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పవన్ కల్యాణ్ సినిమా విడుదలైన థియేటర్లలో ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరమన్నారు. సినిమాకు వచ్చేవారిని భయబ్రాంతులకు గురిచేసేందుకు ఉద్యోగులను థియేటర్ల వద్ద ఉంచారని మండిపడ్డారు. సీఎం జగన్మోహాన్‌రెడ్డి ఇలాంటి పరిపాలన అందిస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. ఆత్మాభిమానంకు, అహాంకారానికి జరిగిన పోరాటామే భీమ్లానాయక్ సినిమా ఇతివృత్తమన్నారు.చివరకు ఆత్మాభిమానమే విజయం సాధిస్తోందన్నారు. సీఎం జగన్మోహాన్‌రెడ్డి కేవలం అహాంకారంతోనే ఇలా వ్యవహారించారని దుయ్యబట్టారు. కర్ప్యూలాంటి వాతావరణం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. కక్ష పూరితంగా, చిన్నమనస్తత్వంతో సామాన్యూలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. తన ఆలోచన మేరకే పనిచేయాలని నియంతలా సీఎం జగన్ వ్యవహారిస్తున్నారని నాదెండ్ల మనోహార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-02-26T21:07:23+05:30 IST