
నందితశ్వేతా లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అక్షర’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మా ‘అక్షర’ సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నాం. సోషల్ మెసేజ్‌తో కూడిన కామెడీ థ్రిల్లర్‌గా మా ఈ మూవీ రూపొందింది . ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్,సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కోవిడ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి కానీ ఈ సినిమాను థియేటర్లలోనే ఎక్స్ పీరియన్స్ చేయాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం. ఇప్పటికే సగం బిజినెస్ అయిపోయింది.ఇంకా మంచి ఆఫర్ లు వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఎక్కడా మిస్ కాకుండా ఓ బర్నింగ్ ఇష్యూని ఈ సినిమాలో చూపించబోతున్నాం. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది’’ అన్నారు