నాడు-నేడు ఫేస్‌-2 కింద 13 పాఠశాలలు

ABN , First Publish Date - 2021-04-22T05:48:17+05:30 IST

మండలంలో 13 పాఠశాలలు నాడు-నేడు ఫేస్‌-2 కింద ఎంపిక చేసినట్లు ఎంఈవో అనూరాధ బుధవారం తెలిపారు.

నాడు-నేడు ఫేస్‌-2 కింద 13 పాఠశాలలు

చాగలమర్రి, ఏప్రిల్‌ 21: మండలంలో 13 పాఠశాలలు నాడు-నేడు ఫేస్‌-2 కింద ఎంపిక చేసినట్లు ఎంఈవో అనూరాధ బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఎస్సీ, బీసీ హాస్టళ్లు, భవిత కేంద్రం, పెద్దబోదనం, మద్దూరు, చింతలచెరువు గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలు, ముత్యాలపాడు బీసీ కాలనీ పాఠశాల, చాగలమర్రి గ్రామంలోని పాతబస్టాండు ఎస్సీ కాలనీ, రెండు ఉర్దూ పాఠశాలలు గుంతపాలెం వీధిలోని ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశామని తెలిపారు. ఆయా పాఠశాలలను నాడు-నేడు ఫేస్‌-2 కింద పనులు చేపట్టి పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సీఆర్పీలు అమీర్‌ఖాన్‌, ఖాసీం, కొండయ్య, వెంకటనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-22T05:48:17+05:30 IST