‘నాడు- నేడులో 20 శాతం పనులు పెండింగ్‌’

ABN , First Publish Date - 2020-12-03T05:46:50+05:30 IST

నాడు- నేడులో భాగంగా మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు 20 శాతం పెండింగ్‌ ఉన్నట్టు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతికుమారి తెలిపారు.

‘నాడు- నేడులో 20 శాతం పనులు పెండింగ్‌’
రాజుపేట పాఠశాలలో మాట్లాడుతున్న డైట్‌ ప్రిన్సిపాల్‌ జ్యోతికుమారి

కోటవురట్ల, డిసెంబరు 2 :  నాడు- నేడులో భాగంగా మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు 20 శాతం పెండింగ్‌ ఉన్నట్టు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జ్యోతికుమారి తెలిపారు. బుధవారం ఆమె కోటవురట్ల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, రాజుపేట యూపీ పాఠశాల, కస్తూర్బా పాఠశాలలో అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. తొలుత ఆయా పాఠశాలల్లో విద్యాబోధన తీరును పరిశీలించి, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం వండి వడ్డించాలని భోజన పథకం నిర్వాహకులకు సూచించారు.  అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల సంఖ్య పెరుగుతున్నట్టు చెప్పారు. మాకవరపాలెంలోని కొన్ని పాఠశాలలు తనిఖీ చేయగా, గుడ్డు వండి పెట్టడం లేదని విద్యార్థులు తనకు వివరించారన్నారు.  డైట్‌ కళాశాల అధ్యాపకుడు మాణిక్యంనాయుడు, ఎంఈవో ప్రసాద్‌, కేజీబీవీ ఎస్‌వో తులసీతో పాటు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:46:50+05:30 IST