Advertisement

నిహారికతో ఇప్పుడు మాటలు తగ్గాయి: నాగబాబు

Jan 24 2021 @ 14:24PM

మెగాబ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారికకు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపిన సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీలో నిహారికను ఎక్కువగా ఇష్టపడే నాగబాబు రీసెంట్‌ ఇంటర్వ్యూలో తన గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "ఈ సృష్టికి మహిళలే మూలం. అందుకనే ఆడవాళ్లంటే గౌరవిస్తాను. ఆడపిల్లలంటే నాకు ఇష్టం. వరుణ్‌తేజ్‌ పుట్టిన తర్వాత కూతురు పుడితే బావుంటుందని అనుకున్నాను. అనుకున్నట్లే నిహారిక పుట్టింది. తనంటే నాకు చాలా ఇష్టం. నాకు మంచి ఫ్రెండ్‌లాంటిది. నేను చాలా విషయాలను నిహారికతో మాట్లాడేవాడిని. పెళ్లి తర్వాత మా మధ్య మాటలు కొంచెం తగ్గాయి. అయితే తను కొత్త జీవితంలోకి అడుగు పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది" అన్నారు నాగబాబు. పిల్లలకు మంచి భాగస్వామ్యులు రావాలని కోరుకుంటానని చెప్పిన నాగబాబు వరుణ్‌తేజ్‌ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ వరుణ్‌ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా లేదా ప్రేమ పెళ్లి చేసుకున్నా తనను అర్థం చేసుకునే అమ్మాయి రావాలనుకుంటున్నానని అన్నారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.