
శ్రీకాకుళం: పొత్తులపై తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) నిర్ణయం తీసుకుంటారని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు (Nagababu) స్పష్టం చేశారు. వైసీపీ (YCP) పాలన ఎలా ఉందో ప్రజలకే బాగా తెలుసని పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాలవారీగా నాగబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం గడపగడపకు వెళ్తున్న వైసీపీ నాయకులకు ఎటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయో అందరికీ తెలుసు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాం. త్వరలో అన్ని నియోజవర్గాలకు ఇన్చార్జిలను నియమిస్తాం. ఉత్తరాంధ్రలో జనసైనికుల్లో జోష్ నింపేందుకు వచ్చాను. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నా. నియోజకవర్గాలవారీ పార్టీ శ్రేణులతో చర్చించిన అంశాలను మా పీఏసీ దృష్టికి తీసుకువెళతాం’’ అని నాగబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి