జర్నలిస్ట్‌గా నాగచైతన్య ?

Published: Fri, 28 Jan 2022 16:00:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జర్నలిస్ట్‌గా నాగచైతన్య ?

నవసామ్రాట్ అక్కినేని నాగచైతన్య గతేడాది ‘లవ్ స్టోరీ’, ఈ సంవత్సరం ‘బంగార్రాజు’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. దీంతో పాటు చైతూ తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దీనికి కూడా విక్రమ్ కె కుమారే దర్శకుడు. ఇదో థ్రిల్లర్ సిరీస్ అని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ రూపొందుతోంది. ఇందులో చైతూ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడని. ఆ పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయని చెబుతున్నారు. అలాగే.. మేకోవర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందట.


మొత్తం మూడు సిరీస్ గా వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుందని సమాచారం. ఒకో సీజన్ లో 8 నుంచి 10 ఎపిసోడ్స్ ఉంటాయట. అంతేకాదు ఇది టైమ్ ట్రావెల్ స్టోరీ అని కూడా తెలుస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ వెబ్ సిరీస్  అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రస్తుతం చైతూ ‘థాంక్యూ’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. షూటింగ్ కంప్లీట్అయిన వెంటనే.. వెబ్ సిరీస్ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International