AP News: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-08-11T13:39:54+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో ఈ రెండు బేసిన్‌లలోని అన్ని ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

AP News: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

నంద్యాల: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో ఈ రెండు బేసిన్‌లలోని అన్ని ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో నమోదవుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar) ప్రాజెక్టులు వరద ఉధృతితో నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. శ్రీశైలం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 3,88,717 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,79,110 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884.60 అడుగుల వరకు నీరు ఉందని అధికారులు తెలిపారు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. 


మరోవైపు కృష్ణా బేసిన్‌ (Krishna Basin)లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 1.75 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 1.75 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి 1.74 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 33 గేట్లు, జూరాలకు 2.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాకతో 38 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు.

Updated Date - 2022-08-11T13:39:54+05:30 IST