Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

Sep 28 2021 @ 08:28AM

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 2  క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 60,573 క్యూసెక్కులు,  అవుట్ ఫ్లో 54,644 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్  పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 589.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను...ప్రస్తుతం నీటి నిల్వ 310.5510 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.