నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-17T13:11:25+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు సాగర్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

నల్గొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు సాగర్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఇన్‌ఫ్లో 2,16,137 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,33,137 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.70 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 311.1486 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-17T13:11:25+05:30 IST