ఏఎన్‌యూకు క్యూఎస్‌ ర్యాంకు

ABN , First Publish Date - 2020-11-27T05:59:21+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరోమారు ప్రతిభను చాటింది. యూకేకు చెందిన ప్రముఖ ర్యాంకుల సంస్థ క్యూఎస్‌ 2021వ సంవత్సరానికి విడుదల చేసిన ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకులలో ఏఎన్‌యూ 551-600వ ర్యాంకును కైవసం చేసుకుంది.

ఏఎన్‌యూకు క్యూఎస్‌ ర్యాంకు

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరోమారు ప్రతిభను చాటింది. యూకేకు చెందిన ప్రముఖ ర్యాంకుల సంస్థ క్యూఎస్‌ 2021వ సంవత్సరానికి విడుదల చేసిన ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకులలో ఏఎన్‌యూ 551-600వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆసియా మొత్తం మీద 650 విశ్వవిద్యాలయాలను క్యూఎస్‌ ఎంపిక చేయగా భారత్‌ నుంచి 107 వర్సిటీలు ఎన్నికయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఉన్నతిని సాధించిందని, దీనికి వర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర, పరిశోధనా విద్యార్థుల కృషి ఎంతో ఉందని వీసీ ఆచార్య రాజశేఖర్‌,  రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, రిజిష్ట్రార్‌ ఆచార్య రోశయ్య తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ ర్యాంకుల సమన్వయకర్త డాక్టర్‌ భవనం నాగకిశోర్‌ మాట్లాడుతూ ఏఎన్‌యూ మొదటిసారిగా క్యూఎస్‌ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకులలో నిలిచిందని తెలిపారు. వర్సిటీలో జరిగిన రాజ్యాంగ దిన వేడుకలలో వీసీ క్యూఎస్‌ ర్యాంకును ప్రకటించారు.   


Updated Date - 2020-11-27T05:59:21+05:30 IST