Nallagonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-08-13T14:11:03+05:30 IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు.

Nallagonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు తగ్గిన వరద

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 51,791 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను...ప్రస్తుతం నీటి నిల్వ 311.1486 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-08-13T14:11:03+05:30 IST