Nagashourya: 'కృష్ణ వ్రింద విహారి'.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్ పోస్టర్

Published: Sat, 22 Jan 2022 13:53:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Nagashourya: కృష్ణ వ్రింద విహారి.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్ పోస్టర్

యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రానికి 'కృష్ణ వ్రింద విహారి' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేసి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను వదిలారు. నేడు ( జనవరి 22 ) హీరో నాగ శౌర్య పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా సొంత బ్యానర్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ఉషా మూల్పూరి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి అనిష్ ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నాగ శౌర కెరీర్‌లో 22వ చిత్రంగా ఇది రూపొందుతోంది. ఇక నాగశౌర్య పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేయగా.. చాలా ట్రెడిషనల్ అండ్ స్పిరిట్చువల్ లుక్‌లో ఉన్న శౌర్య ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఓ సాంగ్ చిత్రీకరణ మినహా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తైందట. శిర్లే సేటియా ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. 

Nagashourya: కృష్ణ వ్రింద విహారి.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్ పోస్టర్


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International