బురదగుంటలో కొన ఊపిరితో వారం రోజుల పాటు మృత్యువుతో ఓ యువతి పోరాటం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-18T21:46:03+05:30 IST

బురదగుంటలో కొన ఊపిరితో వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రాజస్థాన్‌లోని నాగౌర్ యువతి తుదిశ్వాస విడిచింది.

బురదగుంటలో కొన ఊపిరితో వారం రోజుల పాటు మృత్యువుతో ఓ యువతి పోరాటం.. అసలేం జరిగిందంటే..

బురదగుంటలో కొన ఊపిరితో వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రాజస్థాన్‌లోని నాగౌర్ యువతి తుదిశ్వాస విడిచింది. హాస్పిటల్‌లో 8 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉంచినా ఆమె కోలుకోలేకపోయింది. మృత్యువుతో పోరాటంలో ఓటమి పాలైంది. ఈ నెల 4వ తేదీన ఇద్దరు యువకులు ఆ యువతిని కిడ్నాప్ చేసి ఊరు శివార్లకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. 


ఆమెను విపరీతంగా కొట్టి గొంతు కోసేశారు. ఆమె చనిపోయిందనుకుని ఓ బురదగుంటలో పడేసి పరారయ్యారు. అయితే ఆమె చనిపోలేదు. బురదగుంటలోనే ఆరు రోజుల పాటు కొన ఊపిరితో ఉంది. అయితే బురదగుంటలో ఉండే సూక్ష్మజీవులు ఆమె శరీరంలోకి ప్రవేశించి రకరకాల ఇన్ఫెక్షన్లు కలిగించాయి. ఆరు రోజుల తర్వాత స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఆమెను జైపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. 


వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే అప్పటికే ఆమె శరీరం కోలుకోలేని విధంగా గాయపడడంతో ఆమె గురువారం కన్నుమూసింది. కాగా, కేసును విచారించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన సురేష్, మరో మైనర్ బాలుడు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు తేల్చారు. నిందితుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2022-02-18T21:46:03+05:30 IST