
అమరావతి: గతంలో న్యాయ వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేశారు.. నేడు ఆ వ్యవస్థకే కన్నాలు వేసిన గొప్ప ఘనులు వైసీపీ నేతలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గద్దె నేక్కించి పాలన చేయమంటే.. వ్యవస్థలకే పంగనామాలా?మంత్రి కాకాణిగోవర్థన్ రెడ్డిని వెంటనే తొలగించి విచారించాలని నాగోతు రమేశ్ నాయుడు డిమాండ్ చేశారు.