Girl Friendతో సెక్స్ చేస్తుండగా యువకుడికి Cardiac Arrest

ABN , First Publish Date - 2022-07-05T20:35:23+05:30 IST

గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి లాడ్జికి వెళ్లిన 28 ఏళ్ల యువకుడు ఆమెతో లైంగిక కార్యక్రమంలో పాల్గొంటుండగా అనుమానాస్పద ..

Girl Friendతో సెక్స్ చేస్తుండగా యువకుడికి Cardiac Arrest

నాగపూర్ : గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి లాడ్జికి వెళ్లిన 28 ఏళ్ల యువకుడు ఆమెతో లైంగిక కార్యక్రమంలో పాల్గొంటుండగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుండెపోటు రావడంతోనే అతను మరణించినట్టు ప్రాథమిక సమాచారం. నాగపూర్‌లోని సావనీర్ లాడ్జిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.


పోలీసుల కథనం ప్రకారం మృతుడు అజయ్ పార్టెకి డ్రైవర్‌గా, వెల్టింగ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్టు అతని తల్లిదండ్రులు అంటున్నారు. అజయ్,  మధ్యప్రదేశ్‌లోని చింద్వాడాకు చెందిన 23 ఏళ్ల ఒక నర్సుతో గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ విషయం రెండు కుటుంబాల వారికి తెలుసు. ఇద్దరూ ఫేస్‌బుక్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. తాము వివాహం చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని గాళ్‌ఫ్రెండ్ తల్లికి కూడా అజయ్ కొద్దిరోజుల క్రితం తెలియజేశాడు. పెళ్లి కూడా త్వరలోనే జరగాల్సి ఉంది.


అజయ్, అతని గాళ్‌ఫెండ్ మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో లాడ్జికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఒక అరగంట తర్వాత అతను మంచంపై ఉండగానే కుప్పకూలిపోయాడు. అతని గాళ్‌ఫ్రెండ్ వెంటనే ఆ సమాచారం లాడ్జి నిర్వాహకులు తెలియజేయడం, వారి వచ్చి అతని ఆసుపత్రికి తరలించడం, అప్పటికే అతని ప్రాణం పోయినట్టు వైద్యులు నిర్ధారించడం క్షణాల్లో జరిగిపోయాయి. మృతుని వద్ద ఎలాంటి మెడిసన్లు కానీ, డ్రగ్ రేపర్స్ కానీ ప్యాకెట్లు కానీ కనిపించలేదని, అతని గాళ్‌ఫ్రెండ్ కూడా తన సమక్షంలో అజయ్ ఎలాంటి మెడిసన్స్, డ్రగ్స్ తీసుకోలేదని చెప్పిందని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సతీష్ పాటిల్ తెలిపారు. వైద్య పరీక్షల కోసం అతని రక్తం, ఇతర నమూనాలు పంపినట్టు చెప్పారు. కాగా, యువకుడి మరణానికి గుండెపోటు కారణం కావచ్చని పోస్ట్‌మార్టంలో రిపోర్ట్‌లో వైద్యులు వెల్లడించారు.


ఇలాంటివి అరుదు...

ఈ తరహా మరణాలపై ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ సంచేటి మాట్లాడుతూ, సెక్స్ చేస్తుండగా గుండెపోటుతో చనిపోవడం చాలా అరుదని, అయితే అందుకు అవకాశం కూడా లేకపోలేదని అన్నారు. కరోనరో ఆర్టెరీ డిసీజ్ (coronary artery disease)తో 20 ఏళ్ల యువకులకు కూడా ఇలాంటి మరణం సంభవించవచ్చని చెప్పారు. హార్డ్ బ్లాక్ వంటివి ఇవాల్టి యువతలో ఎక్కువగా కనిపిస్తోందని, కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌కు సరైన చికిత్స తీసుకోని పక్షంలో ఎక్కువ శక్తిని ఉపయోగించే సెక్స్ వంటి కార్యకలాపాల సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అన్నారు. 25 ఏళ్లు వచ్చేసరికి హార్డ్ చెకప్ చేయించుకోవడం మంచిదని సూచించారు. 

Updated Date - 2022-07-05T20:35:23+05:30 IST