ప్రియుడి సలహాతో YouTube వీడియోలు చూసి అబార్షన్‌కు ప్రయత్నించిన ఆ 25 ఏళ్ల యువతి పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే...

ABN , First Publish Date - 2021-09-29T12:35:26+05:30 IST

యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఇంట్లోనే స్వయంగా...

ప్రియుడి సలహాతో YouTube వీడియోలు చూసి అబార్షన్‌కు ప్రయత్నించిన ఆ 25 ఏళ్ల యువతి పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే...

యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఇంట్లోనే స్వయంగా అబార్షన్ చేసుకున్న మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన 25 ఏళ్ల యువతి ఇప్పుడు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. వీడియో చూసి తన గర్భంలోని పిండాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించి అనారోగ్యం పాలయిన ఆ యువతి ఆసుపత్రిలో చేరింది. ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. కాగా ఆ యువతికి ఇటువంటి సలహా ఆమె ప్రియుడే ఇచ్చినట్లు తెలుస్తోంది. 


బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెబుతూ, 2016 నుంచి ఆమెపై పలు మార్లు అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. అయితే ఆమె గర్భవతి కాగానే అతను యూట్యూబ్‌లో వీడియోలు చూసి, అబార్షన్ చేయించుకోమంటూ ఆమెకు సలహా ఇచ్చాడు. ఆమె చేత ఏవో మాత్రలు కూడా మిగించాడు. బొడ్డు తాడును తెంచి, శరీరం నుంచి పిండాన్ని వేరుచేయడంపై వివరాలున్న యూట్యూబ్‌లోని వీడియోను నిందితుడు ఆ మహిళకు చూపించాడు. అతను చెప్పిన ప్రకారం ఆ యువతి తమ ఇంటి వంట గదిలోని పరికరాలను వినియోగించి, అబార్షన్ చేసుకుంది. ఈ ఘటన సెప్టెంబరు 23న జరిగింది. అయితే బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అత్యాచారం కేసుపై అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి మాట్లాడుతూ నిందితుడు ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు కొని, బాధితురాలికి ఇచ్చాడని తెలిపారు. 


నిందితుడు సోహెల్ యశోధరా నగర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడని, వివాహితుడైవుండి కూడా ఈ మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితునికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడన్నారు. ఆ మహిళ అబార్షన్ చేసుకున్న తరువాత ఆ పిండాన్ని ఒక స్మశానవాటికలో ఖననం చేసిందన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి బృందం ఖననం చేసిన ఆ పిండాన్ని వెలికితీసి పరీక్షలు చేయనుందని పోలీసులు వివరించారు.

Updated Date - 2021-09-29T12:35:26+05:30 IST