మాజీ ప్రియురాలి అమ్మమ్మ, సోదరుడిని హతమార్చిన ప్రియుడు

ABN , First Publish Date - 2020-12-11T15:56:09+05:30 IST

తమ ప్రేమకు అడ్డు పడ్డారనే కోపంతో ఓ ప్రియుడు తన మాజీ ప్రియురాలి అమ్మమ్మ, సోదరుడిని చంపిన దారుణ ఘటన....

మాజీ ప్రియురాలి అమ్మమ్మ, సోదరుడిని హతమార్చిన ప్రియుడు

నాగపూర్ (మహారాష్ట్ర): తమ ప్రేమకు అడ్డు పడ్డారనే కోపంతో ఓ ప్రియుడు తన మాజీ ప్రియురాలి అమ్మమ్మ, సోదరుడిని చంపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో వెలుగుచూసింది.నాగపూర్ నగరంలో నేరచరిత్ర ఉన్న 17 ఏళ్ల యువకుడికి గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్ లో 20 ఏళ్ల యువతితో స్నేహం ఏర్పడింది. వారు ఒకరినొకరు కలుస్తుండే వారు. క్రిమినల్ నేపథ్యం ఉన్న యువకుడితో సంబంధం పెట్టుకోవద్దని యువతి అమ్మమ్మ చెప్పడంతో యువతి ప్రియుడితో మాట్లాడటం మానేసింది. తమ ప్రేమను ప్రియురాలి అమ్మమ్మ అడ్డుకుందనే కోపంతో ప్రియుడు కత్తితో వచ్చి మాజీ ప్రియురాలి అమ్మమ్మ, ఆమె తమ్ముడిని పొడిచి చంపాడు. ఈ హత్య కేసులో నిందితుడైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నాగపూర్ పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-12-11T15:56:09+05:30 IST