Advertisement

`బిగ్‌బాస్`కు షాక్.. నాగార్జున వస్తారా? రారా?

Oct 6 2020 @ 14:33PM

నెల రోజుల క్రితం ప్రారంభమైన `బిగ్‌బాస్` సీజన్-4 కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతోంది. తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తోంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో `కింగ్` నాగార్జున చేస్తున్న సందడి ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు అనుకోని సమస్య వచ్చి పడింది. నాగార్జున ప్రస్తుతం `వైల్డ్ డాగ్` సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం నాగార్జున థాయ్‌లాండ్ వెళ్లాల్సి ఉంది. అక్కడే ఓ పది రోజులు షూటింగ్ చేయాలి.


అదే జరిగితే ఈ వీకెండ్ `బిగ్‌బాస్`కు నాగ్ అందుబాటులో ఉండరు. గత సీజన్‌లోలా వేరొక హోస్ట్‌ను తీసుకురావాలి. అయితే అలా చేయడం అటు నాగార్జునకు, ఇటు షో మేనేజ్‌మెంట్‌కూ ఇష్టం లేనట్టు తెలుస్తోంది. దీంతో వీకెండ్ సమయంలో ఓ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని హైదరాబాద్ రావాలని నాగ్ అనుకుంటున్నారట. `బిగ్‌బాస్` నిర్వాహకులు కూడా దానికి సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి, ఈ ప్లాన్ ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.