డోన్‌కు గోరుకల్లు నీరు

ABN , First Publish Date - 2021-11-19T05:56:30+05:30 IST

డోన్‌ డివిజన్‌లోని ఐదు మండలాల తాగు నీటి సమస్యను గోరుకల్లు రిజర్వాయర్‌ నీటితో పరిష్కరించడానికి రూ.297 కోట్లతో పనులను ప్రారంభించారు.

డోన్‌కు గోరుకల్లు నీరు

  1. రూ.297 కోట్లతో పనులు ప్రారంభం


పాణ్యం,నవంబరు 18: డోన్‌ డివిజన్‌లోని ఐదు మండలాల  తాగు నీటి సమస్యను గోరుకల్లు రిజర్వాయర్‌ నీటితో పరిష్కరించడానికి రూ.297 కోట్లతో పనులను ప్రారంభించారు. సుగాలిమెట్ట సమీపంలో అటవీ శాఖ కేటాయించిన 0.54 హెక్టార్లలో పనులను మెగా కన్‌స్ట్రక్షర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ చేపట్టింది. సుగాలిమెట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్‌ సంప్‌కు గోరుకల్లు రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ను తరలించి నిల్వ ఉంచుతారు. అక్కడి నుంచి బేతంచెర్ల మండలం బుగ్గన్నపల్లె వద్ద నిర్మించే ట్రీట్‌ మెంట్‌ సంపునకు నీటిని తరలించి శుద్ధి చేసి డోన్‌ నియోజకవర్గంలోని కరువు ప్రాంతాలకు ఈ నీటిని పైపులైను ద్వారా తరలిస్తారు. 38 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసి అక్కడి నుంచి డోన్‌ నియోజకవర్గానికి నీటిని తరలించేందుకు పనులు ప్రారంభమయ్యాయి. 547 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైను పనులు చేపట్టాల్సి ఉంది. కాగా పాణ్యం మండలంలోని తమ్మరాజుపల్లె, పిన్నాపురం గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటుండగా ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు సాగునీరందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.



Updated Date - 2021-11-19T05:56:30+05:30 IST