‘ఈ దెబ్బతో కొడాలినాని పతనమే’

ABN , First Publish Date - 2022-06-27T21:25:53+05:30 IST

గుడివాడలో జరిగే మహానాడు కొడాలినాని పతనానికి నాంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు.

‘ఈ దెబ్బతో కొడాలినాని పతనమే’

అమరావతి: 29న గుడివాడలో జరిగే మహానాడు కొడాలినాని పతనానికి నాంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్ధే రకం కొడాలి నాని అని మండిపడ్డారు. వాపు చూసి బలుపు అనుకుంటున్న కోడాలినానికి ఇంతకింతకు గుణపాఠం తప్పదన్నారు. కార్యకర్తల తెగువ, కసితో కొడాలినాని లాంటి నాయకుల కొట్టుకుపోక తప్పదని చెప్పారు. గుడివాడ మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు ప్రత్యేక దృష్టితో చూస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన గుడివాడ మహానాడును విజయవంతం చేసేందుకు మా శ్రేణులు కసిగా ఉన్నాయన్నారు. 



Updated Date - 2022-06-27T21:25:53+05:30 IST