
గుంటూరు: జగన్ పాలన గురించి ప్రశ్నిస్తే నిన్న ఆర్యవైశ్యుడు.. నేడు దళితుడిని చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మద్యం ధరలు ఎందుకు పెంచాడో... ఎందుకు తగ్గించాడో తెలియదు. సినిమా టికెట్లను మాత్రం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. మద్యం మాత్రం జగన్ ఆధీనంలో ఉండాలి. మద్యం ధరల గురించి మాట్లాడితే వెంకట నారాయణను కొట్టి తగలబెట్టారు. ఇంతవరకు పోలీసులు స్పందించకపోవడం దారుణం. బాధితులు కూడా తమకు జరిగిన బాధను చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. దళితులపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి’’ అని నక్కా ఆనంద బాబు సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి