AP News: దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశారు: ఆనందబాబు

ABN , First Publish Date - 2022-07-26T17:16:07+05:30 IST

దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు.

AP News: దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశారు: ఆనందబాబు

గుంటూరు జిల్లా (Guntur Dist.): జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Anandababu) ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దళితుల ఓట్లతో గెలిచి.. వారికే ద్రోహం చేశారని విమర్శించారు. అంబేద్కర్ (Ambedkar) పేరిట విదేశీ విద్యా దీవెన పథకం పెడితే దాని పేరు మార్చారని, అంబేద్కర్ పేరు మార్చే దుర్మార్గపు పని జగన్ తప్ప ఎవరూ చేయలేరన్నారు. దళితులకు రూపాయి కూడా రుణం ఇవ్వని ముఖ్యమంత్రి... కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. దళిత గిరిజనులకు ఒక్క పథకం కూడా లేకుండా రద్దు చేశారని మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం టీడీపీ (TDP) ఆందోళనకు పిలుపిస్తే అడ్డుకున్నారని, పోలీసులు తన ఇంటికి వచ్చి నిర్బంధించారన్నారు. ఎందుకు అడ్డుకున్నారో పోలీసులు చెప్పటం లేదన్నారు. తన ప్రాథమిక హక్కులను (Fundamental rights) పోలీసులు హరిస్తున్నారని, ఎవరూ చెబితే పోలీసులు మమ్మల్ని ఆపుతున్నారు?.. ముఖ్యమంత్రా? లేక సజ్జల (Sajjala) ఆదేశాలతో పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు అడ్డగోలుగా పెరిగాయని నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-07-26T17:16:07+05:30 IST