ఇకపై మహిళలను చిన్నచూపు చూడరు: నటి నక్షత్ర నగేష్‌

Jul 30 2021 @ 20:29PM

ఇటీవలి కాలంలో అటు బుల్లితెర, ఇటు వెండితెరలపై లేడీ ఓరియంటెడ్‌తో కూడిన సీరియల్స్‌ లేదా సినిమాలు అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఈ పరిణామాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది లేడీ సినీ సెలెబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో నక్షత్ర నగేష్‌ ఒకరు. ఈ లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాలపై ఆమె స్పందిస్తూ.. ‘‘ఇటీవలి కాలంలో మహిళా కథాంశాలతో పాటు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు రావడం చాలా మంచి పరిణామం. అనేకమంది కథా రచయితలే మహిళలను కేంద్రంగా చేసుకుని కథలను సిద్ధం చేస్తున్నారు. అందువల్ల ఇకపై మహిళలను బుల్లితెర లేదా వెండితెరలపై చిన్నచూపు చూడరు. అలాగే, స్ర్కిప్టుకు తగినట్టుగా ప్రతి ఒక్కరూ నటించాలి. అయితే, ఇప్పుడు మారుతున్న కాలానికి తగ్గట్టుగా తెరకెక్కించే విధానం కూడా ఎప్పటికప్పుడు మారిపోతుంది’’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘తమిళముం సరస్వతియుం’ అనే సీరియల్‌లో నటిస్తోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.