నల్లగొండ జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-07-23T03:24:31+05:30 IST

నల్లగొండ జిల్లాలో గురుకుల విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపుతోంది. గురువారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో

నల్లగొండ జిల్లాలో కరోనా కలకలం

నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లాలో గురుకుల విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపుతోంది. గురువారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో 46మందికి కరోనా నిర్ధారణ కాగా, తాజాగా శుక్రవారం నార్కట్‌పల్లి గురుకుల కళాశాలలో 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కళాశాలలో 160 మంది విద్యార్థులు ఉండగా, 50 మంది విద్యార్థులు స్వల్పంగా అస్వస్థతకు గురికావడంతో కళాశాల నిర్వాహకులు వారిని స్థానిక నార్కట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అక్కడ వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆ విద్యార్థులను హోంక్వారంటైన్‌ కోసం వారి ఇళ్లకు పంపించారు. కరోనా వ్యాప్తి కాకుండా నివారణ చర్యలు చేపట్టారు. డీఎంహెచ్‌వో కొండల్‌రావు గురుకుల కళాశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Updated Date - 2022-07-23T03:24:31+05:30 IST