Advertisement

దారుణం: పోలీసుల దెబ్బలు తాళలేక మహిళ మృతి

Oct 17 2020 @ 17:02PM

నల్గొండ: అడవిదేవులపల్లి మండలం ఉన్సాయిపల్లిలో దారుణం జరిగింది. గ్రామంలో నాటుసారా అమ్ముతుందన్న ఆరోపణలతో సక్రి అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన విషయం చెప్పకుండా పెన్షన్ ఇప్పిస్తానంటూ నమ్మించి ఎస్ఐ నాగుల మీరా.. సక్రిను పోలీస్‌ స్టేషన్‌‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌లో పోలీసుల దెబ్బలు తాళలేక వృద్ధురాలు కేతావత్ సక్రి(60) మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో భయాందోళన చెందిన పోలీసులు... పోలీస్ స్టేషన్ తలుపులు మూసుకుని పరారయ్యారు.

Follow Us on:
Advertisement
Advertisement