Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..

ABN , First Publish Date - 2021-09-30T13:30:32+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల

Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 74,699 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం: 311.74 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం: 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం : 589.90 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-09-30T13:30:32+05:30 IST