నల్లగొండ: నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వామపక్షాల అభ్యర్థి జయసారథి రెడ్డి మంగళవారం కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం జయసారథి మాట్లాడుతూ నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జర్నలిస్టులు సహకరించాలని కోరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పే లెక్కలన్నీ దొంగలెక్కలే అని అన్నారు. రెగ్యులర్ చేసిన పాత ఉద్యోగాలను కలిపి లక్షా31 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల ఖాళీలు, భర్తీలపై ఆధారాలతో సహా చర్చకు ఎక్కడైనా సిద్ధమని సవాల్ విసిరారు. భూటకపు మాటలు చెబుతున్న టీఆర్ఎస్, భవిష్యత్లో ఉద్యోగాలు లేకుండా చేసే బీజేపీలను ఓడించాలని జయసారథి రెడ్డి పిలుపునిచ్చింది. నామినేషన్ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.