Nallagonda: 108 వాహనంలోనే ప్రసవం

Sep 20 2021 @ 07:04AM

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో 108 వాహనంలో ఆదివారం తల్లి పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే చింతపల్లి మం డలం గొడుకొండ్లకు చెందిన టేకుల మమతకు ఆదివారం పురుటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు కాన్పు కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు రక్తం తక్కువగా ఉం దని నల్లగొండకు తీసుకెళ్లాలని సూచించడంతో 108 వాహనంలో బయలుదేరారు. ఆ తర్వాత 10నిమిషాల్లో కొండమల్లేపల్లి వద్ద సాధారణ కాన్పు అయింది. దీంతో 108 వాహనాన్ని నిలిపారు.


ఆ సమయ ంలో అటుగా వెళ్తున్న కొండమల్లేపల్లి సర్పంచ్‌ కుంభం శ్రీనివా్‌సగౌడ్‌ విష యం తెలుసుకొని నూతన వస్ర్తాలను మహిళకు అందజేశారు. దేవరకొండ ఏరియా ఆస్పత్రిలో సాధారణ కాన్పుకు అవకాశం ఉన్నా చేయకుండా నల్లగొండకు వెళ్లాలని సూచిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఆరో పించారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములునాయక్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా మమతను కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకువచ్చారని, విధుల్లో ఉన్న వైద్యులు నిర్వహించారని, నెలలు సరిగా నిండకపోవడం, బలహీనంగా ఉండడంతో నల్లగొండ ఆస్పత్రికి రెఫర్‌ చేశారని తెలిపారు. 

Follow Us on:

తెలంగాణ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.