నల్లగొండ: జిల్లాలోని వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి-నార్కట్ పల్లి హైవేపై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదారాబాద్ నుండి కందుకూరు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి గల ముఖ్య కారణమని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రలను ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి