Projects water flow: మూసీ, నాగార్జునసాగర్, పులిచింత ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-07-29T14:59:30+05:30 IST

జిల్లాలోని మూసీ, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

Projects water flow: మూసీ, నాగార్జునసాగర్, పులిచింత ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

నల్లగొండ: జిల్లాలోని మూసీ (Musi), నాగార్జునసాగర్ (Nagarjunasagar), పులిచింతల(Pulichintala) ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆయా ప్రాజెక్ట్‌ల గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. 


మూసీ ప్రాజెక్ట్...

మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 9,960 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 6,783.67 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా... ప్రస్తుత సామర్థ్యం 637.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను...  ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2.73టీఎంసీలుగా నమోదు అయ్యింది.

 

నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 63.512 క్యూసెక్కులు

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 63.512 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 2,367 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 216.4350 టీఎంసీలుగా కొనసాగుతోంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 553.00 అడుగులకు చేరింది. 


172.242 అడుగులకు చేరిన పులిచింతల ప్రాజెక్ట్ నీటిమట్టం

పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 18,869 క్యూసెక్కులు  ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అలాగే అవుట్ ఫ్లో 10,400 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం : 172.242 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 41.58 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మూడు యూనిట్ల ద్వారా 10,000 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. లీకేజీల ద్వారా 400 క్యూసెక్కుల నీరు వృధాగాపోతోంది. 

Updated Date - 2022-07-29T14:59:30+05:30 IST