నల్గొండ: జిల్లాలోని కోదాడ మండలం తోగార్రాయి శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురెదురుగా రెండు బైక్‌లు పరస్పరం ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు కోదాడ పట్టణం తమ్మరబండ పాలెంకు చెందిన అంజద్(20), బొమ్మకంటి అరవింద్(22)గా గుర్తించారు. మరో ఇద్దరు మైసయ్య, అనిల్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేళ్లచెర్వు జాతరకు బైక్‌పై ముగ్గురు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి