నల్లగొండను సుందరీకరించాలి

ABN , First Publish Date - 2022-05-20T06:08:50+05:30 IST

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు నల్లగొండను అన్నివిధాల అభివృద్ధి చేసి సుందరీకరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు సత్యనారాయణ అన్నా రు.

నల్లగొండను సుందరీకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న సంచాలకులు సత్యనారాయణ

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు సత్యనారాయణ

నల్లగొండ టౌన్‌, మే 19: సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు నల్లగొండను అన్నివిధాల అభివృద్ధి చేసి సుందరీకరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు సత్యనారాయణ అన్నా రు. గురువారం కలెక్టరేట్‌లో నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అమృత్‌-2 పథకం కిం ద చేపట్టనున్న మురుగు నీటి పారుదల, తాగునీటి సరఫరా పనులపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌తో కలిసి నల్లగొండ మునిసిపల్‌ కౌన్సిలర్లు, అధికారులు, ప్రజారోగ్యశాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, ఎమ్మెల్యే, కలెక్టర్‌ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు, ఇంజనీర్లకు సూచనలు చేస్తున్నారని తెలిపారు. పట్టణ జనాభాకు సరిపోయే విధంగా డ్రైనేజీ వ్యవస్థ ప్రణాళికలకు డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా అమృత్‌ సిటీ పథకం కింద తాగు నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థకు రూ.600కోట్లకు ప్రతిపాదనలు పంపగా నల్లగొండ పట్టణానికి 216.19కోట్లు, యూజీడీకి 56.75కోట్లు మంజూరయినట్లు తెలిపారు. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ గ్రామం, పట్టణంలోని ప్రతీవార్డులో క్రీడా ప్రాంగణాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకు డు సుభాని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి, ప్రజారోగ్య శాఖ ఎస్‌ఈ కందుకూరి వెంకటేశ్వ ర్లు, ఈఈ సత్యనారాయణ, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, కౌన్సిల ర్లు అభిమన్యు శ్రీనివాస్‌, బుర్రి శ్రీనివా్‌సరెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మీ, బండారు ప్రసాద్‌, కొండూరు సత్యనారాయణ, అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-05-20T06:08:50+05:30 IST