నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై మిర్యాలగూడ బైపాస్ రోడ్‌లో ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తన్న బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి