Nallagondaలో భారీ ఎత్తున సారా, బెల్లం పానకం ధ్వంసం
ABN , First Publish Date - 2022-05-28T15:49:05+05:30 IST
జిల్లాలోని తిరుమలగిరి(సాగర్) మండలంలో భారీ ఎత్తున సారా, బెల్లం పానకాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ధ్వంసం చేసింది.
నల్లగొండ: జిల్లాలోని తిరుమలగిరి(సాగర్) మండలంలో భారీ ఎత్తున సారా, బెల్లం పానకాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ధ్వంసం చేసింది. నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ శంభు ప్రసాద్ ఆదేశాలతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం రంగంలోకి దిగింది. దాదాపు 40 లీటర్ల సారా, 70 కేజీల పట్టిక, 1500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేస్తున్న వారిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు.