నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ షాప్ నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రానికి మున్సిపాల్టీ చెత్త వాహనంలో బియ్యం సరఫరా చేశారు. అపరిశుభ్రమైన చెత్త వాహనంలో చిన్న పిల్లలు తినే బియ్యం సరఫరా చేయడంపై మున్సిపల్ అధికారులను స్థానికులు నిలదీశారు.
ఇవి కూడా చదవండి