
లఖ్‌నవూ: భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈద్(Eid) పండగ నాడు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో రోడ్డు మీద నమాజ్(namaz) చేయడం ఆగిపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) అన్నారు. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు (law and order situation) పూర్తిగా అదుపులో ఉన్నాయని, రామనవి(Ram Navami) రోజున రాష్ట్రంలో ఎక్కడా అల్లర్లు జరగడం లేదని ఆయన అన్నారు. ఆదివారం రాష్ట్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఉత్తరప్రదేశ్‌లో రామనవమి చాలా గొప్పగా కొనసాగుతోంది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి అల్లర్లు లేవు. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి ఘటనలేవీ కనిపించడం లేదు. అలాగే రాష్ట్రంలో మొదటిసారి ఈద్‌కు అయినా అల్విదా జుమా(రంజాన్ చివరి శుక్రవారం) అయినా రోడ్లపై నమాజ్ చేయడం ఆగిపోయింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. మా ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తోంది. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోశాలలు నిర్మిస్తోంది. ప్రార్థనా స్థలాల నుంచి లౌడ్స్పీకర్లను తొలగిస్తోంది. 700లకు పైగా మతపమైన నిర్మాణాలు చేస్తోంది’’ అని యోగి అన్నారు.
ఇవి కూడా చదవండి