కోనసీమ జిల్లా పేరు మార్పు

ABN , First Publish Date - 2022-05-18T21:43:02+05:30 IST

కోనసీమ జిల్లా పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కోనసీమ జిల్లా పేరు మార్పు

అమరావతి: కోనసీమ జిల్లా పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై త్వరలో నోటిఫికేషనల్ విడుదల కానుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఈ జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు, టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ డిమాండ్ సాధన కోసం అంశాల వారిగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే కోనసీమ జిల్లా పేరులో అంబేద్కర్ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-05-18T21:43:02+05:30 IST