నమిత నటన..నిర్మాణం

ABN , First Publish Date - 2021-03-07T05:44:50+05:30 IST

గతంలో వెండితెరపై అందాల రాణిగా తమిళ ప్రేక్షకుల హృదయాలను ఏలారు నమిత. 2017లో వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్నాక సినిమాల నుంచి విరామం తీసుకొన్నారు...

నమిత నటన..నిర్మాణం

గతంలో వెండితెరపై అందాల రాణిగా తమిళ ప్రేక్షకుల హృదయాలను ఏలారు నమిత. 2017లో వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్నాక సినిమాల నుంచి విరామం తీసుకొన్నారు.  తాజాగా ‘భౌ వౌ’ అనే చిత్రం ద్వారా వెండితెరపైకి పునరాగమనం చేస్తున్నారు. ఈ చిత్రంలో నమిత నటిస్తూ నిర్మిస్తున్నారు. ఓ కుక్క ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. మలయాళ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఇతర బాషల్లో డబ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అడవుల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నమిత షేర్‌ చేశారు. నమిత పోరాట సన్నివేశాల్లో చాలా శ్రమించారు. ముఖ్యంగా రోప్‌సీన్లలో అయితే చాలా కష్టపడ్డారు. తనే నిర్మాత కావటంతో సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా తెరకిక్కిస్తున్నారు 

నమిత

Updated Date - 2021-03-07T05:44:50+05:30 IST