Sakshi మీడియాపై కోర్టు ధిక్కరణ పిటిషన్.. ఇవాళ విచారణ జరిగిందిలా..!

ABN , First Publish Date - 2021-09-09T18:05:22+05:30 IST

సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ పిటిషన్‎ను గురువారం నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై తీర్పు

Sakshi  మీడియాపై కోర్టు ధిక్కరణ పిటిషన్.. ఇవాళ విచారణ జరిగిందిలా..!

హైదరాబాద్: సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ పిటిషన్‎ను గురువారం నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై తీర్పు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగా.. పిటిషన్‌ను కొట్టి వేశారని ‘సాక్షి’ మీడియాలో కథనాన్ని ప్రచారం చేశారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ వేశారు. ఈ క్రమంలో సాక్షి మీడియా ఎడిటర్ మురళి, సీఈఓ వినయ్ మహేశ్వరికి న్యాయస్థానం సమన్లను జారీ చేసింది. ఇవాళ విచారణకు ఎడిటర్ మురళి, సీఈఓ వినయ్ మహేశ్వరి హాజరయ్యారు. కౌంటర్ దాఖలకు మరో రెండు వారాలు గడువు కావాలని సాక్షి మీడియా కోరింది. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2021-09-09T18:05:22+05:30 IST