
హైదరాబాద్: నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గంజాయి సరఫరా కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు నాంపల్లి కోర్టు తెలిపింది. నదీమ్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించినట్లు నాంపల్లి కోర్టు పేర్కొంది. 2020 ఆగస్ట్ 20న పతంగి టోల్‌ప్లాజా దగ్గర 1425 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2020 ఆగస్ట్ 21న నిందితుడు నదీమ్‌ను డీఆర్ఐ అరెస్ట్ చేసింది.
