
విశాఖపట్నం: నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నర్సీపట్నంలో బాలయ్య అఖండ సినిమాకి అఘోరాలు తరలివచ్చారు. నర్సీపట్నం బంగార్రాజు ధియేటర్లో అఘోరాలు సందడి చేశారు. అఖండ సినిమాతో బాలయ్య అఘోరాలు కూడా ఫ్యాన్స్ అయ్యారంటూ అభిమానులు థియేటర్లో కేకలు వేశారు. కాసేపు బాలయ్య అభిమానులతో మాట్లాడి, శివ నామం పలుకుతూ అఘోరాలు బయటకి వెళ్లారు.