'మా' ఎన్నికల్లో ఓటు వేసిన బాలకృష్ణ

ABN , First Publish Date - 2021-10-10T15:56:38+05:30 IST

‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ('మా') ఎన్నికలు కొనసాగుతున్నాయి. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

'మా' ఎన్నికల్లో ఓటు వేసిన బాలకృష్ణ

హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ('మా') ఎన్నికలు కొనసాగుతున్నాయి. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా నటుడు నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు ప్యానెల్స్‌ వారు బాగా చేస్తున్నారని తెలిపారు. విష్ణు, ప్రకాష్‌రాజ్ ఇద్దరూ అన్నదమ్ముల లాంటివారే అని అన్నారు. ఇరు ప్యానెళ్లవారు మంచి చేసేలా కనిపిస్తోందన్నారు. ఎన్నికలు ముగిశాక మళ్లీ అందరం కలిసి పనిచేయాల్సిందే అని చెప్పారు. సినీ పరిశ్రమలో వర్గాలు అనేవి లేవని.. కలిసే ఉంటామని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-10T15:56:38+05:30 IST