రాయల్‌ లుక్‌లో నందమూరి హీరో!

Published: Sun, 29 May 2022 01:34:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాయల్‌ లుక్‌లో నందమూరి హీరో!

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరం సందర్భంగా ఆయన మనవడు కల్యాణ్‌రామ్‌ నటిస్తూ నిర్మిస్తున్న ‘బింబిసార’ చిత్రం పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కల్యాణ్‌రామ్‌ రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఆ రెండు లుక్స్‌లో ఆయన రాయల్‌గా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన మగధ రాజు బింబిసారుడిగా కనిపించనున్నారు. ‘ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌’ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్‌. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో వశిస్ట్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో చిత్రం ఉంది.  భారీ సెట్స్‌తో  కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని   ఆగస్ట్‌ 5న విడుదల చేయడానికి నిర్మాత కె.హరికృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International