ltrScrptTheme3

‘అక్షర’ మలుపు ఏంటి అనేది చెప్పను: నందితా శ్వేత

Feb 25 2021 @ 20:31PM

'ఎక్కడికిపోతావు చిన్నవాడా' చిత్రంతో టాలెంటెడ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కన్నడ నాయిక నందితా శ్వేత. ఆ చిత్రంతో నటిగా మంచి పేరునే సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'ప్రేమ కథా చిత్రమ్ 2', 'శ్రీనివాస కళ్యాణం' వంటి చిత్రాల్లో ఆమె నటించింది. ఇటీవలే వచ్చిన 'కపటధారి' చిత్రంలో కూడా ఓ కీ రోల్‌లో నటించింది. తాజాగా 'అక్షర'తో వచ్చేందుకు రెడీ అయింది. సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై బి. చిన్నికృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న ‘అక్షర’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ నందితా శ్వేత చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.


ఆమె మాట్లాడుతూ.. 

నా కెరీర్‌లో హారర్ ఫిలింస్ ఎక్కువ చేయలేదు. ప్రేమకథా చిత్రమ్2, ఎక్కడికి పోతావు చిన్నవాడా మాత్రమే చేశాను. ఈ చిత్రంలో విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడుతాను. ట్విస్ట్ ఉంటుంది కథలో. ఆ మలుపు ఏంటి అనేది చెప్పను. సినిమాలో చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఏదో సందేశం చెబుతున్నాం. మీరు కూర్చుని చూడండి అని ఉండదు. మెసేజ్ కాకుండా సినిమాకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అక్షర నాకు ఒక ఛేంజ్ ఓవర్ మూవీ అనుకోవచ్చు. కెరీర్ బిగినింగ్‌లోనే ఫీమేల్ స్ర్కిప్ట్ చేయడం అంటే సాహసం అనుకోవాలి. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కొంత భయపడ్డాను. ఇప్పుడు నేను సందేశం చెబితే తీసుకుంటారా లేదా అనేది సందేహించాను. కానీ డేర్ డెసిషన్ తీసుకున్నాను. టీమ్ కూడా నన్ను తీసుకోవడంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అక్షర మూవీ కోసం నన్ను పిలిచినప్పుడు హారర్ మూవీనే కదా అనుకున్నాను. కానీ చిన్నికృష్ణ గారు కథ చెప్పినప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. షకలక శంకర్, మధు నందన్, సత్య, అజయ్ ఘోష్ చేసిన క్యారెక్టర్లు, చేసిన కామెడీ చాలా బాగుంటుంది.అక్షర సినిమాలో హారర్ లేదు. సస్పెన్స్ ఉంటుంది. 

లాక్‌డౌన్‌లో ఫస్ట్ 3 మంత్స్ రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆన్ లైన్ కోర్సులు చేశాను. వెబ్ సిరీస్ లో ఛాన్సులు వచ్చాయి. కానీ నేను అంగీకరించలేదు. దానికి కారణం.. నిర్మాతలు చాలా మంది లాక్ డౌన్ ముందు చేసిన సినిమాలు థియేటర్లోనే రిలీజ్ చేయాలని అనకున్నారు. ఓటీటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపించలేదు. నా సినిమాల్లో ఇటీవల కపటధారి థియేటర్లో రిలీజ్ అయ్యింది. మార్చి నుంచి చూస్తే అక్షరతో కలిపి నేను చేసిన నాలుగు సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. ఇది మరే హీరోయిన్‌కు దక్కని ఘనత అనుకోవచ్చు.


ఈ చిత్రానికి స్క్రిప్ట్ ఈజ్ హీరో అనుకుంటాను. అందులో నా క్యారెక్టర్ ఎంత బాగుంది,  ఎంత నిడివి ఉంది అని ఆలోచించేదు. అక్షరలో నన్ను ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో చూస్తారు. కపటధారిలో నా క్యారెక్టర్ తక్కువ ఉంది అని కొందరు అన్నారు. సహజంగానే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్‌కు తక్కువగానే స్పేస్ ఉంటుంది. ఆ వాస్తవం నాకు తెలుసు. తమిళం, తెలుగులో ఒకేసారి కపటధారి చిత్రాన్ని చిత్రీకరించాం. అదొక కొత్త అనుభవం నాకు. 


ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాత్రమే కాదు ఏ సిస్టమ్ అయినా ఫ్లస్ మైనస్ ఉంటాయి. ఎడ్యుకేషన్‌పై ఎందుకు చేశామంటే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్టూడెంట్స్ సఫర్ అవడం నాకు ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది. మన పిల్లలు కాన్వెంట్ లో చదవాలని తల్లిదండ్రులు అంతా అనుకుంటారు. అలాగే మా పేరెంట్స్ కూడా చిన్నప్పుడు నన్ను పెద్ద స్కూల్ లో వేశారు. ఆ ఏడాది నాకు వారితో అడ్జస్ట్ కావడం చాలా కష్టమైంది. ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని అనడంతో కూడా ఇబ్బంది పడ్డాను. ఫీజ్ కట్టడం కూడా కష్టమైంది. ఆతర్వాత తొమ్మిదో తరగతి నుంచి కార్పొరేషన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. నా లాంటి కథే చాలా మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉంటుంది.

విద్యా వ్యవస్థలోని లోపాలను చెబుతున్నాం. కానీ విద్య లేనిదే ఎదగలేము అని చెప్పలేదు. విద్య వల్లే జీవితంలో పైకి వస్తాము అని కాదు. కమ్యునికేషన్ బాగుంటుంది ఎడ్యుకేషన్ ఉంటే. నేను ఉన్నత చదువు వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. హీరోయిన్‌గా నాకూ పేరు చ్చింది.


అక్షరలో విద్యా వ్యవస్థ అంశాలతో కామెడీ చేయలేదు. ఎడ్యుకేషన్‌కు కామెడీకి సంబంధం లేదు. అవి రెండు వేరే వేరే ట్రాక్‌లు ఉంటాయి. ఎంటర్‌టైనింగ్ కోసమే కామెడీ పెట్టాం. ప్రేక్షకుల వినోదం కోసం చేసిన పాత్రలు అవి. ఈ చిత్రంలో నటించడం ఛాలెంజింగ్ గా అనిపించలేదు. క్యాజువల్‌గానే నటించాను. ఎక్కడికి పోతావు చిన్నవాడాలో రెండు పాత్రల మధ్య ట్రాన్సఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు కష్టం అనిపించింది. కానీ ఈ చిత్రంలో ఒకే పాత్ర కంటిన్యూగా ఉంటుంది కాబట్టి కేవలం యాక్ట్ చేశాను.. అంతే.


ఫ్లాప్ అయితే మూవీస్ రావు అంటారు, గ్లామర్ గా లేకుంటే మూవీస్ రావు అంటారు, ఎడు ఏనిమిది సినిమాలు చేశాను. నందిత సినిమా చేయలేదు అని ఎవరూ అనరు. ఇప్పటికీ అవకాశాలు బాగానే వస్తుంటాయి. అక్షర లాంటి చిత్రం చేశాను.. సంతృప్తిగా ఉంది. ప్రతి సినిమా కష్టపడే చేస్తుంటాము. విజయం, అపజయం నా చేతిలో లేదు. అక్షర ఓన్లీ తెలుగు, మిగతా భాషల్లో అనుకుంటున్నారు చూడాలి.  


రాజు గారి గది హీరో అశ్విన్‌తో  ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అందులో ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. చాలా కష్టపడి నటిస్తున్నాను. దబాంగ్ మూవీకి తమిళ్, తెలుగు, కన్నడకు డబ్బింగ్ చెప్పాను. శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను. నేను ఇంట్రోవర్ట్, ఎక్కువగా అందరితో కలవను కాట్టి లాక్‌డౌన్ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.