Nandyala: గృహప్రవేశంలో విషాదం

ABN , First Publish Date - 2022-06-04T14:36:46+05:30 IST

జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన కాంట్రాక్టర్ రమణ ఇంటి గృహప్రవేశంలో విషాదం చోటు చేసుకుంది.

Nandyala: గృహప్రవేశంలో విషాదం

నంద్యాల: జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన కాంట్రాక్టర్ రమణ ఇంటి గృహప్రవేశంలో విషాదం చోటు చేసుకుంది. నూతనంగా నిర్మించిన ఇంటికి విద్యుత్ అలంకరణ పనులు చేస్తుండగా యువకుడికి విద్యుత్ షాక్ తగిలింది. రవితేజ అనే 26 సంవత్సరాల యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... చంద్రశేఖర్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. 

Updated Date - 2022-06-04T14:36:46+05:30 IST