నంద్యాల - కడప రైలును పునరుద్దరించాలి

ABN , First Publish Date - 2022-01-22T04:47:33+05:30 IST

కరోనా కారణంతో రెండేళ్లగా నిలుపుదల చేసిన నం ద్యాల - కడప డెమో రైలు సర్వీసును వెంటనే పునరుద్దరించాలని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి డిమాండు చేశారు.

నంద్యాల - కడప రైలును పునరుద్దరించాలి

కడప - బెంగుళూరు మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలి

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 21: కరోనా కారణంతో రెండేళ్లగా నిలుపుదల చేసిన నం ద్యాల - కడప డెమో రైలు సర్వీసును వెంటనే పునరుద్దరించాలని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి డిమాండు చేశారు. జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కడప - బెంగుళూరు రైలు మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. నంద్యాల - కడప రైలు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మే లుగా ఉండేదన్నారు. కడప నుంచి నంద్యాల వెళ్లాలన్న, అక్కడి నుంచి కడపకు రావాలన్నా ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులు చొర వ చూపి, నంద్యాల - కడప రైలు సర్వీసును పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు.

2008లో టీడీపీ ప్రభుత్వం కడప - బెంగుళూరు రై లు మార్గానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా కడప నుంచి పెండ్లిమర్రి వరకు రైలు మార్గం పూర్తయిందన్నారు. కడప నుంచి పెండ్లిమర్రి, రాయచోటి, వాయల్పాడు, మదనపల్లి, కోలార్‌ గుండా బెంగుళూరుకు 255 కిలోమీటరు అవుతుంద న్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ మార్గాన్ని రద్దు చేస్తూ కేంద్రానికి లేఖ పంపిందన్నా రు. దీనికి ప్రత్యామ్నాయంగా ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా ఆనంతపు రం జిల్లా ముదిగుబ్బ వరకు 72కిలోమీటర్లు వేయడానికి రూ.1400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ముదిగుబ్బ నుంచి పాకాల, ధర్మవరం గుండా బెంగుళూరు కలుస్తుందన్నారు. ఈ క్రమంలోనే కడప బెంగుళూరు రైలు మార్గం అందరికీ ఉపయోగం టుం దని, వెంటనే పూర్తి చేయాలని, ఈ దిశగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని లింగారెడ్డి శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 




Updated Date - 2022-01-22T04:47:33+05:30 IST