Nandyala: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-09-15T13:41:44+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో

Nandyala: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత

నంద్యాల: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 3,20,351 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 3,42,185 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 214 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2022-09-15T13:41:44+05:30 IST