Nani: బార్లు, పబ్స్ కంటే సినిమా థియేటర్లే సేఫ్: హీరో నాని

Jul 28 2021 @ 14:00PM

నేచుర‌ల్ స్టార్ నాని ఓ స‌గ‌టు ప్రేక్ష‌కుడిగా మారి త‌న మ‌న‌సులోని భావాల‌ను వ్య‌క్తం చేయ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కోవిడ్ టైమ్‌లో థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వాలు సినీ ఇండ‌స్ట్రీకి కాస్త కూస్తో మ‌ద్దతు తెలిపినా పూర్తి స్తాయి స‌హ‌కారం అయితే అంద‌లేదనేది నిజం. కోవిడ్‌.. రెండు వేవ్స్‌లోనూ నిర్మాత‌లు ఓ ర‌కంగా న‌ష్ట‌పోతే, ఎగ్జిబిట‌ర్స్ మ‌రో ర‌కంగా న‌ష్ట‌పోయారు. వాళ్లే కాదు.. థియేట‌ర్స్ మీద ఆధార‌ప‌డి బ‌తికే ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయ‌నేది కాద‌న‌లేని వాస్త‌వం. కోవిడ్ టైమ్‌లో ముందుగా మూత ప‌డ్డ‌వి థియేట‌ర్స్‌.. అలాగే చివ‌ర‌గా ఓపెన్ అయిన‌వి కూడా థియేట‌ర్సే. బార్స్‌, ప‌బ్స్‌ను ముందుగా ఓపెన్ చేసిన‌ప్పుడు, వాటికి లేని ఆటంకం థియేట‌ర్స్‌ను ఓపెన్ చేయ‌డానికి ఎందుకు? అని ఎవ‌రూ అడ‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో, నాని స‌గ‌టు ప్రేక్ష‌కుడిగా మారి కొన్ని విష‌యాల‌ను మాట్లాడారు. 

‘‘వేరే దేశాల్లో వీకెండ్స్ వ‌స్తే అమ్మ‌, నాన్న‌ల‌ను చూడ‌టానికి వెళ‌తారు. కానీ మ‌నం అమ్మ‌, నాన్న‌ల‌తో సినిమాకెళ‌తాం. అలాగే వేరే దేశాల్లో వీకెండ్స్‌లో ఫ్రెండ్స్‌ను క‌ల‌వ‌డానికి వెళ‌తాం. కానీ మ‌నం ఫ్రెండ్స్‌తో పాటు సినిమా కెళ‌తాం.. బోర్ కెడితే బార్ కెళ్లి అటు నుంచి థియేట‌ర్ కెళ‌తాం.  థియేట‌ర్స్‌లో సినిమా చూడ‌టం అనేది మ‌న సంస్కృతి. సాధార‌ణంగా కోవిడ్ టైమ్‌లో ముందుగా థియేట‌ర్స్ క్లోజ్ చేసేసి, లాస్ట్‌లో థియేట‌ర్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. బార్స్‌, ప‌బ్స్‌లో మాస్కులు తీసేసి పెద్ద‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాటితో పోల్చితే థియేట‌ర్స్ సేఫ్ ప్లేస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మ‌నం సినిమాను ఓ వైపుకే మాట్లాడ‌కుండా చూస్తాం. అలాగ‌ని థియేట‌ర్స్‌ను ముందుగానే ఓపెన్‌చేయాల‌ని నేను చెప్ప‌డం లేదు.. కానీ అన్నింటితో పాటు ఓపెన్ చేయ‌వ‌చ్చు కదా, అని అంటున్నాను. ఇది నానిగా నేను మాట్లాడటం లేదు. ప్రేక్ష‌కుడిగా మాట్లాడుతున్నాను. థియేట‌ర్ అనేది మ‌న జీవితంలో ఓ భాగ‌మైపోయింది. ఇంటి త‌ర్వాత ఎక్కువ‌గా థియేట‌ర్స్‌లోనే గ‌డిపి ఉంటాం. జాగ్ర‌త్తలు తీసుకుని వెళితే, థియేట‌ర్స్ చాలా సేఫ్ ప్లేస్‌. ఫిజిక‌ల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మెంట‌ల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్‌. మెంట‌ల్ హెల్త్‌కు మూల కార‌ణాలైన ఆర్ట్‌ఫామ్స్ ఎక్క‌డైతే ఎక్కువ‌గా ఉన్నాయో, ఆ దేశాల్లో ప్ర‌శాంత‌త ఎక్కువ‌గా ఉంటుంది. 

మ‌న దేశంలో సినిమాకు మించిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేదు. థియేట‌ర్స్ అనేది పెద్ద ఇండ‌స్ట్రీ. దానిపై ఆధార‌ప‌డి ల‌క్ష‌లాది కుటుంబాలున్నాయి. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌, థియేట‌ర్స్‌లో ప‌నిచేసే వాళ్లున్నారు. అలా చాలా మంది లైఫ్‌లు ఆధార‌ప‌డి ఉన్నాయి. ఎంటైర్ ఇండియాలో ఇదే స‌మ‌స్య ఉంది. త్వ‌ర‌లోనే ఇది మారుతుంద‌ని భావిస్తున్నాను. ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌న్నీ పెరిగిపోతున్నాయి. కానీ సినిమా ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌చ్చేస‌రికి బోల్డెన్ని ప‌రిమితులుంటున్నాయి. చాలా చిన్న స‌మ‌స్య‌గా అనుకుంటున్నారు. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఉండేవాళ్ల కోసం అది చిన్న స‌మ‌స్య అయ్యుండవ‌చ్చునేమో కానీ.. చాలా కుటుంబాల‌కు అది చాలా పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ప‌రిస్థితులు వ‌ల్ల ఓ ఎకో సిస్ట‌మ్ పాడైతే మ‌న భ‌విష్య‌త్ త‌రాల వాళ్ల‌కి ఇబ్బంది. ఓ చీక‌టి ప్రాంతంలో కొంద‌రితో క‌లిసి సినిమా చూడ‌ట‌మ‌నేది ఓ మ్యాజిక‌ల్ ఫీలింగ్‌. నెక్ట్స్ జ‌నరేష‌న్ దాన్ని మిస్ అవుతుంది. దాని కోసం ప్ర‌భుత్వాలు, మ‌నం క‌లిసి పూనుకోవాలో ఏమో తెలియ‌డం లేదు. కానీ.. మ‌న‌సులో చిన్న భ‌యం, బాధ ఉంది. ఇది త్వ‌ర‌గా ప‌రిష్కార‌మైపోవాలి’’ అన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.